Type Here to Get Search Results !

ప్రశ్నలు సమాధానాలు పేజీ -12

ప్రశ్నలు సమాధానాలు పేజీ -12

1. ఒకే పర్యటనలో అన్ని ఫార్మాట్లలోనూ ("T20, ONE DAY, TEST" Cricket Matches) అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించినది ?

(ఎ) వాషింగ్టన్ సుందర్

(బి) శుభ్ మన్ గిల్

(సి) మహమ్మద్ సిరాజ్

(డి) తంగరసు నటరాజన్


2. "ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఓటరు చైతన్యవంతం కావాలి" అని తెలియజేసిన రాజనీతి శాస్త్ర పితామహుడు ?

(ఎ) సోక్రటీస్

(బి) అరిస్టాటిల్

(సి) కౌటిల్యుడు

(డి) ఎపిక్యురస్


3. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించే 'ప్రధానమంత్రి బాల పురస్కార్' కు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు చిన్నారులు ఎంపికయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి "అమేయ లగుడు" (విశాఖపట్నం) ఏ విభాగంలో ఈ పురస్కారానికి ఎంపికయ్యారు ? [మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 32 మంది విద్యార్థులను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. వీరిలో తెలంగాణ నుంచి 'హేమేష్ చదలవాడ' కూడా ఉన్నారు]

(ఎ) కళలు, సంస్కృతి

(బి) సామాజిక సేవ

(సి) నవకల్పన

(డి) స్కాలస్టిక్ అచీవ్మెంట్



4. పర్యవేక్షణ సౌలభ్యం కోసం 'ఏపీ ఫైబర్ నెట్' (AP FiberNet) ను ఏ శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

(ఎ) పర్యటక శాఖ

(బి) ఆర్ధిక శాఖ

(సి) విద్యుత్ శాఖ

(డి) హోం శాఖ


5. హైదరాబాద్ (తెలంగాణ రాష్ట్రం) లోని 'రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల' (DRDL) లో కొత్తగా ఏర్పాటు చేసిన "వెపన్స్ సిస్టమ్ డిజైన్ సెంటర్" (Weapon System Design Centre) ను భారత ఉప రాష్ట్రపతి 'ఎం.వెంకయ్య నాయుడు' ప్రారంభించిన తేదీ ?

(ఎ) 2021 జనవరి 24

(బి) 2021 జనవరి 25

(సి) 2021 జనవరి 26

(డి) 2021 జనవరి 27


6. 'జమ్మూ - కాశ్మిర్' లో 370, 35-ఏ అధికరణలు రద్దైన తేదీ ?

(ఎ) 2019 ఆగస్ట్ 5

(బి) 2019 ఆగస్ట్ 6

(సి) 2019 ఆగస్ట్ 7

(డి) 2019 ఆగస్ట్ 8



7. ప్రపంచ ఆర్ధిక వేదిక 2019లో వెలువరించిన 'ప్రయాణ, పర్యాటక పోటీ నివేదిక' లో భారత్ స్థానం ? [ప్రపంచ ఆర్ధిక వేదిక 2019 నివేదిక ప్రకారం భారతదేశ జీడీపీ (GDP) లో ప్రయాణ, పర్యాటక రంగం వాటా 4.9 శాతంగా ఉంది]

(ఎ) 32

(బి) 33

(సి) 34

(డి) 35


8. అమెరికా అధ్యక్షుల పదవీ స్వీకార సందర్భాల్లో పాల్గొన్న కవులందరికన్నా అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్రలో నిలిచిన "అమందా గోర్మాన్" (AMANDA GORMAN) వయసు ? [2021 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా 'జో బైడెన్' ప్రమాణం చేసిన సందర్భంలో అయిదు నిముషాలపాటు 'అమందా గోర్మాన్' చెప్పిన "ది హిల్ ఉయ్ క్లైమ్బ్" (THE HILL WE CLIMB) కవితలో అమెరికాలో వరుసగా జరిగిన రాజకీయ పరిణామాలను, ప్రస్తుత పరిస్థితులతోపాటు భవిష్యత్తులో ఏదిశగా అడుగులేస్తే ప్రజలంతా సుభిక్షంగా జీవిస్తారో తెలియజేసింది]

(ఎ) 21 సంవత్సరాలు

(బి) 22 సంవత్సరాలు

(సి) 23 సంవత్సరాలు

(డి) 24 సంవత్సరాలు


9. అధ్యక్షుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా, పదవిని స్వచ్చందంగా వీడేందుకు ఒప్పుకోని పరిస్థితుల్లో 'ఉపాధ్యక్షుడు, మెజారిటీ కేబినెట్' నిర్ణయించడం ద్వారా అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తప్పించేందుకు అమెరికా రాజ్యాంగంలో 25వ సవరణ తీసుకొచ్చిన సంవత్సరం ?

(ఎ) 1961

(బి) 1962

(సి) 1963

(డి) 1964



10. 100 మంది సభ్యులున్న అమెరికా 'సెనేట్' (SENATE) లో రిపబ్లికన్లకు, డెమొక్రాట్లకు ప్రస్తుతం ఉన్న సీట్లు ?

(ఎ) 52, 48

(బి) 51, 49

(సి) 50, 50

(డి) 49, 51


సమాధానం :

1) డి 2) బి 3) ఎ 4) సి 5) బి 6) ఎ 7) సి 8) బి 9) సి 10) సి  




Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom