ముక్కోటి ఏకాదశి
తలస్నానము చేసి తెలుపు పట్టు వస్త్రాలను ధరించి పూజకు విష్ణుమూర్తి ఫోటోను సిద్ధం చేసుకోవాలి. పసుపు అక్షతలు, తామర పువ్వులు, తులసిదళములు, నైవేద్యానికి పాయసం, రవ్వలడ్డులు, జామకాయలు సిద్ధం చేసుకోవాలి.
మధ్యాహ్నం 12 గంటల నుండి పూజ చేయవచ్చు. పూజకు విష్ణు అష్టోత్తరము, శ్రీమన్నారాయణ స్తోత్రము, విష్ణుపురాణము, దశావతారములు పారాయణము చేయాలి.
ఇంకా ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు, వెంకటేశ్వర దేవాలయం దర్శించుకోవడం శుభఫలితాలనిస్తుంది. ఆలయాల్లో విష్ణు అష్టోత్తరము వంటి పూజలు నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి.
దీపారాధనకు ఎర్రటి రెండు ప్రమిదలు, 5+5 వత్తులు తీసుకోవాలి. పంచహారతికి ఆవునేతిని, దీపారాధనకు కొబ్బరి నూనె వాడాలి. నుదుట తిరునామము ధరించి, ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 మార్లు జపించి అనంతరం దీపారాధన చేయాలి. పూజచేసేటప్పుడు తులసిమాల ధరించి, తూర్పు వైపు కూర్చోవాలని పండితులు చెబుతున్నారు
సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత నుంచి మకర రాశి సక్రమణం వరకు జరిగే సమయంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది.ఈరోజున వైకుంఠ వాకిట్లో తెరుచుకుని ఉంటాయని చాలామంది భక్తులు నమ్ముతారు.
అందుకే ఈరోజున వైష్ణవ దేవాలయాలలో గల ఉత్తర ద్వారం నుంచి భక్తులు భగవంతుని దర్శించుకుంటారు.శేషా తల్పం మీద శయనించి ఇచ్చే విష్ణు మూర్తిని దర్శించుకోవడానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భంగా ఈ వైకుంఠ ఏకాదశి అని పెద్దవారు చెబుతూ ఉంటారు.
పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామి దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యా లోకాలు ప్రాప్తిస్తాయని వేద పండితులు చెబుతున్నారు.ముక్కోటి ఏకాదశి రోజున ఉదయమే విష్ణుమూర్తి దర్శనం చేసుకుని ఆ తర్వాత పూజ చేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం లభిస్తుందని చాలామంది భక్తులు విశ్వసిస్తారు.
ఇంకా చెప్పాలంటే ముక్కోటి ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తిని నియమా నిష్ఠత్లతో పూజ చేసి ఏకాదశి వ్రతమాచరించే వారికి మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.ముక్కోటి ఏకాదశి రోజు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రావణం వంటివి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాయని చెబుతున్నారు.
ఒకవేళ ఎవరికైనా ఇవన్నీ చేయడానికి వీలు లేకపోతే వారు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల తమకున్న సమస్యలన్నీ దూరమైపోతాయని చెబుతున్నారు.
హిందూ సంప్రదాయం ప్రకారం ఏకాదశి తిథికి చాలా విశిష్టత ఉంది. మన దగ్గర చాలా మంది.. నెలలో వచ్చే రెండు ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉంటారు. ఇక ఏడాదికి ఉండే 24 ఏకాదశుల్లో.. వైకుంఠ ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత నుంచి మకర సంక్రమణం వరకు జరిగే సమయంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే.. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారు.
శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోడానికి.. తరలివెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి.. స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భమే ఈ వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉదయమే.. విష్ణు మూర్తిని దర్శనం చేసుకుని.. ఆ తర్వాత పూజ చేసి.. ఆరోజంతా ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని భక్తులు నమ్ముతారు. ఏడాది మొత్తంలో 24 ఏకాదశులు రాగా.. వాటిల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని వేదపండితులు చేబుతున్నారు.
ఇక ముక్కోటి ఏకాదశికి సంబంధించి పురాణాల్లో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ రోజు శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై ఎక్కి.. మూడు కోట్ల దేవతలతో కలిసి.. భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. అలానే ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సరి సమానమైన పవిత్రతను సంతరించుకున్నందున.. దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని మరో కథ ప్రచారంలో ఉంది. అలానే క్షీరసాగర మధనం జరిగింది.. హాలాహలం, అమృతం రెండు పుట్టింది ముక్కోటి ఏకాదశి రోజునే అని కూడా ప్రచారంలో ఉంది. పురాణాల ప్రకారం.. శివుడు విషాన్ని మింగింది.. మహాభారత యుద్ధంలో.. శ్రీకృష్ణుడు.. అర్జునుడికి భగవద్గీతను బోధించింది కూడా ఇదే రోజు అని భక్తులు విశ్వసిస్తారు.
ముక్కోటి ఏకాదశి రోజున.. విష్ణుమూర్తిని నియమ నిష్ఠలతో పూజ చేసి.. ఏకాదశి వ్రతమాచరించే వారికి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం వంటివి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాయని అంటున్నారు. ఒకవేళ ఎవరికైనా.. ఇవన్నీ చేయడానికి కుదరకపోతే.. వారు ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా.. తామనుకున్న పనులు విజయవంతం అవుతాయని అంటున్నారు.