Type Here to Get Search Results !

టెంపుల్స్ లో టెక్నాలజీ - Technology in Temples

 టెంపుల్స్ లో టెక్నాలజీ.

ప్రపంచంలోని హిందువులలో మెజార్టీ శాతం మంది ప్రజలు దేవుడిని నమ్ముతారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ కుల దైవం మరియు నచ్చిన దైవాన్ని కొలుస్తూ ఉంటారు. ఆ దేవుళ్లకు సంబంధించిన దేవాలయాలకు వెళ్తుంటారు. అలా వెళ్లే వారిలో చాలా మంది తమ కోరికలన్నీ నెరవేరాలని.. తమ కష్టాలన్నీ తొలగిపోవాలని.. తాము ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. హిందూ సనాతన సంప్రదాయంలో ఎంతో టెక్నాలజీ దాగి ఉంది. అందుకే మన పండితులు, పెద్దలు అనునిత్యం దేవాలయాలకు వెళ్లి రండి అని చెబుతూ ఉంటారు. వారు ఎందుకు అలా చెబుతారు. దాని వెనుక ఉన్న రహస్యాలేంటి.. అసలు అప్పట్లోనే దేవాలయాల్లో టెక్నాలజీ ఎలా వాడారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


తరంగాలు కలిసేచోట:

మన భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ మరియు విద్యుత్ అయస్కాంత తరంగాలు కలుస్తాయో అక్కడే దేవాలయంలోని మూల విరాట్ ఉంటుంది. వాటిని ఆలయాల్లో ప్రతిష్టించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు క్యాటలిస్టుగా పని చేస్తాయి. 


దేవాలయ దర్శనం:

మనలో చాలా మంది దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే చాలా మంది అందరూ ఎడమవైపు నుండి (Clockwise Direction) ప్రదక్షిణలు చేస్తారు. ఎవ్వరూ అందుకు యాంటీక్లాక్ వైపు నుండి చేయరు. అలా ఎందుకు తిరుగుతారంటే.. అలా తిరిగినప్పుడు అక్కడే ఉండే తరంగాల శక్తి మన దేహానికి వస్తుందని చాలా మంది నమ్మకం. ఇవి మన బాడీలోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.


మంత్రాలు:

ప్రతి దేవాలయంలోనూ పూజారులు మంత్రాలను చదువుతూ ఉంటారు. అయితే ఈ మంత్రాలు ఎందుకు చదువుతారనే విషయం చాలా మందికి తెలియదు. పూజారులు మంత్రాలు ఎందుకు చదువుతారంటే.. అక్షర నియమంతో ఉండే మంత్రాలు ఒక లయగా ఉండి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి.


బంగారానికి తరంగాలకు లింక్:

మనం దేవాలయాలకు వెళ్లేటప్పుడు మన పెద్దలు మంచి ఆభరణాలు వేసుకోమని చెబుతూ ఉంటారు. అయితే వీటి ద్వారా మన ఆడంబరాలను చూపించడానికి అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఎందుకంటే ఈ బంగారు ఆభరణాలు తరంగాలను బాగా గ్రహిస్తాయట.


గర్భగుడి గురించి:

మన హిందూ దేవాలయాల్లో చాలా వాటికి గర్భగుడులు ఉంటాయి. ఈ గర్భగుడి ఎప్పుడూ ఒక వైపుకు మాత్రమే ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే గర్భగుడిలో ఎదురుగా ఉండకుండా ఒకవైపుకే ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు.


తడిబట్టలు ఎందుకంటే:

మనలో చాలా మంది దేవాలయాలకు తడి బట్టలతో వెళ్తుంటారు. దీన్ని మడి ఆచారం అని కూడా అంటూ ఉంటారు. సాధారణంగా తడి బట్టలకు ఆక్సీజన్ ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. దీని వల్ల అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి.


హారతి: 

ప్రతి దేవాలయంలో భక్తులకు హారతి ఇస్తుంటారు. పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి. దీనిని ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని అంటారు. అయితే ఎక్కడో దూరంలో ఉండే హారతిని కళ్లకు అద్దుకుంటే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.


అభిషేకం తర్వాత:

ఇక మన దేవాలయాల్లో దేవుళ్లకు అభిషేకము  చేసిన తర్వాత తీర్థం ఇస్తుంటారు. ఆ తీర్థంలో పచ్చకర్పూరం, తులసి, లవంగాలు మరియు పంచామ్రుతంతో పాటు అభిషేకం చేసిన వాటిని తీర్థంగా ఇస్తుంటారు. ఇంత ఆధునిక సాంతికేతికత ఉన్న మన దేవాలయాలు మానసిక, శారీరక సుఖాన్ని అందిస్తాయి. 




Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom