Type Here to Get Search Results !

ఈశ్వర దండకం

ఈశ్వర దండకం

శ్రీ కంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ ! మురారి! ప్రియ చంద్రధారీ ! మహేంద్రాది బృందారకానంద సందోహ

సంధాయి పుణ్య స్వరూపా ! విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా ! దేవ నీదైన తత్వంబు ! భావించి బుద్ధిం బ్రధానంబు కర్మంబు!

విజ్ఞాన ఆధ్యాత్మ యెాగంబు ! సర్వ క్రియా కారణంబంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతుల్ ! విచారించుచో నిన్ను

భావింతు రీశాన సర్వేశ్వరా ! సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా ! నిర్వికల్ప ప్రభావా ! భవానీ పతీ ! నీవు లోక త్రయీ వర్తనంబుల్

మహీవాయుఖాత్వగ్ని సోమార్క తోయంబు లం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై ఆది దేవా! మహాదేవ

నిత్యంబు నత్యంత యెాగస్థితి న్నిర్మల జ్ఞాన దీప ప్రభా జాల ! విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ ! జితక్రోధరోగాది దోషుల్ ! యతీంద్రుల్ ! యతాత్ముల్ ! భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్ సదాతృప్తులైరి అవ్యయా! భవ్య సేవ్యా! భవా భర్గ భట్టారకా ! భార్గవాగస్థ్య కుత్సాది నానా

ముని స్తోత్ర దత్తవధానా ! లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ ! భస్మానులిప్తాంగ ! గంగాధరా ! నీ ప్రసాదంబునన్ ! సర్వ గీర్వాణ గంధర్వులున్ ! సిద్ధసాధ్యోరగేంద్రామరేంద్రాదులున్ !

శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా !! సురాభ్యర్చితా !! నాకున్ అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ !! త్రిలోకైకనాథా !

మహా దేవ దేవా !! నమస్తే నమస్తే నమస్తే నమః !!

మహా భారత అరణ్య పర్వంలో

అర్జునుడు ఈశ్వరుని మెప్పించి పాశుపతాది దివ్యాస్త్రములు పొంది ఈ దండకంతో శివుని స్తుతించాడు.

 

Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom