పర్యావరణ హిత జీవనశైలి :
మనం రోజు వారి జీవితం లో మునిగి పోయి చిన్న చిన్న అంశాలను పట్టించు కోము. మన జీవన శైలి పర్యావరణా నికి నష్టం కలిగించకుండా పర్యావరణ హితంగా ఉండాలి. దానివలన మనకు ఆరోగ్యం, ప్రకృతికి సేవ మరియు ఆర్ధికంగా మనకు, సమాజానికి ఉపయుక్తం. కార్యక్రమం స్వాతంత్ర్యం సిద్ధించిన 75 వ ఏట ప్రారంభించిన సందర్భంగా వ్యక్తులు సమూహాలు మరియు సంస్థలు తమ రోజు వారి జీవితాల్లో సులభమైన పర్యావరణ హిత మైన చర్యలు అవలంబించేలా చేయడం కోసం మొత్తం 7 కేటగిరి లలో సమగ్రమైన 75 LiFE కార్యక్రమా ల జాబితా లో పర్యావరణ హితాన్ని కోరే మిత్రులంతా ఈ వ్యాసాలను చదివి మీ జీవన శైలి ని పర్యావరణ హితంగా మార్చుకోండి.
కేటగిరి 1:విద్యుత్ ఆదా
అంశం 1:LED bulb లు /tube lights నే వాడండి
మనం 40W బల్బ్ వాడటం కంటే 40 w tubelight వాడటం వలన ఎక్కువ కాంతి ఇస్తుంది ఇంకా LED Tube lights వాడటం చాలా మేలు మామూలు ఫ్లోరోసెంట్ tube light 4-6 సం. లు వెలిగితే LED tube light 10 సం. వరకు వెలుగుతుంది.40,000 గంటల పాటు వెలుగుతుంది.60% విద్యుత్ ఆదా అవుతుంది. మరియు డబ్బు కూడా ఆదా అవుతుంది పర్యావరణం మీద తక్కువ ప్రభావం చూపిస్తుంది.