Type Here to Get Search Results !

భాషా భాగాలు

భాషా భాగాలు
వివిధ భాషలలో భాషా భాగాలు వేర్వేరు రకాలుగా విభజించబడ్డాయి.

చరిత్ర
పదాల వర్గీకరణ చరిత్రలో చాలా పురాతన కాలం నుంచి గమనించవచ్చు. సంస్కృత వ్యాకరణ వేత్త "యాస్కుడు", క్రీ. పూ. 5 లేక 6 వ శతా నిరుక్తము అనే గ్రంధంలో పదాలను నాలుగు ముఖ్యమైన భాగాలుగా విభజించాడు. 

నామ 

ఆఖ్యాత - క్రియ

ఉపసర్గ

నిపాత

ఈ నాలుగు భాగాలను రెండు వర్గాలుగా విభజించాడు. (నామ, ఆఖ్యాత) మరియూ (ఉపసర్గ, నిపాత)


ప్రస్తుత భాషాభాగాలు తెలుగులో భాషా భాగాలు

నామవాచకములు - మనుష్యుల పేర్లు, జంతువుల పేర్లు, ప్రదేశముల పేర్లు, వస్తువుల పేర్లు తెలియజేయు పదములు నామ వాచకములు. కృష్ణ, సీత, పాఠశాల.

సర్వనామములు - నామ వాచకములకు బదులుగా వాడబడునది - నువ్వు, మీరు,నేను,వాళ్ళు,వీరు

విశేషణములు - నామవాచకం యొక్క గుణములను తెలియజేయు పదములు విశేషణములు - నీలము, ఎరుపు, చేదు, పొడుగు.

క్రియలు - పనులన్నియు క్రియలు - చదువుట, తినుట, నడచుట.

అవ్యయములు - లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు - భలే, అక్కడ,అయ్యో,అమ్మో.



Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom