Type Here to Get Search Results !

లాలి పాటలు

లాలి పాటలు
ఏడ్చే పిల్లని బుజ్జగిస్తూ, లాలిస్తూ పాడే పాటలు లాలి పాటలు. నిద్రపుచ్చుటకై జోకొడుతూ పాడే పాటలు జోల పాటలు 


రామాలాలీ
రామాలాలీ మేఘశ్యామాలాలీ

తామరస నయనా దశరథ తనయా లాలీ

అద్దాల పెట్టెలోన ఆదివిష్ణువు

ముద్దు పాపడున్నాడనుచు

మురియుచుంటినీ

ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా

ఇంతుల చేతుల కాకకెంతొ కరిగినావురా



లాలి లాలి
లాలి లాలి ఓ లాలి నీవే నా పాప లాలి

లాలి లాలి ఓ లాలి నీవే నా పాట లాలి



లాలి లాలి ఓ లాలి నీవే నా/మా అమ్మ లాలి

లాలి లాలి ఓ లాలి నీవే నా జోల లాలి

లాలి లాలి ఓ లాలి నీవే నా జో జో లాలి



జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా పాప లాలి

జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా పాట లాలి

జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా/మా అమ్మ లాలి

జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా జోల లాలి

జో జో జో జో ఓ లాలి జో జో జో జో నీవే నా జో జో లాలి



లాలి లాలి ఓ లాలి.. .. లాలి లాలి ఓ లాలి .. .. లాలి లాలి ఓ లాలి



ఏడవకు ఏడవకు
ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి

ఏడిస్తే నీ కనుల నీలాలు కారు

నీలాలు కారితే నే చూడలేను

పాలైనా కారవే బంగారు కనుల



ఉయ్యాల జంపాల
ఉయ్యాల జంపాలలూగరావమ్మ

వెలలేని బంగారుటూగుటుయ్యాల ||ఉ||



కమలమందున బుట్టి కమలాక్షుని చేపట్టి

కామూని కన్నట్టి కంజదళనేత్రి ||ఉ||



శుభశుక్రవారమున సుదతులు వూచ

నూరి జనము పొగడ సుందరముగాను

కోటి సూర్యుల కాంతి కొల్లగొట్టగను

కావేటీ రంగనితో కలసినీవూగ ||ఉ||



శ్రీ విల్లి పూత్తూరిలో వెలసితివి తల్లీ

శ్రీరంగధాముని చేపట్టితివమ్మా

చేరి కూర్చుండేటి చక్రధరుని గూడి

చేతనులను రక్షించ చెలులందరు ఊచ ||ఉ||



సీతమ్మకి లాలి
నవరోజి రాగము - ఖండజాతి ఏకతాళము

లాలిబం| గరుబొమ్మలాలిమా| య.మ్మ. సా స సా | స స సా స | సా రి స నీ పా|ని స రిగా రి లాలిము | ద్దుల్ గు.మ్మ | లాలిసీ.| త.మ్మా. రీగా మా | ప మ గి ర స | సా రి సని | దనిని ద ప లాలీ.

మొదటి భాగములోని 'స స సా' ల మెత్తని స్పర్శా, చివ్వరి 'రీ సా' ల లలిత అవరోహణమూ నరాలను సళ్ళించడానికి చాలా సహాయకారులు కనుకనే నిద్ర జో కొట్టడానికి ఉపయోగించేవి లాలి పాటలు పాడుదురు.


లాలనుచు
ఆనందభైరవి రాగము

లాలనుచు పాడరమ్మా,

ఈబిడ్డ లక్ష్మీవిలాసుడమ్మా

పాదమున చక్రమమ్మా,

ఈ బిడ్డ వేదాంతవేద్యుడమ్మా

వేణునాదంబుతోను,

ఈ బిడ్డ వేదములు పాడునమ్మా.

ఇలాంటి పాటల వరుసను బట్టే కస్తూరి రంగ రంగా అన్నపాట జోలపాటగా మొదలుపెట్టిఉంటారు.


రామ లాలీ
శ్రీ రాగము - చతురశ్ర జాతి ఏకతాళము.

రా.మ| లా లీ| మే.ఘ.|శ్యామ|లా..|లీ.|.. సససని| సరీ, |రీ;|గరీరీస|నీసా|గరిరిస|సని|పా;;|| తామ|ర.స.| నయనా| దశరథ|తనయా| లా..|లీ| రీరీ|గరిరిస|సనిపా|పనినిస|నిససరి| గరిరిస|సా;|;;||

Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom