Type Here to Get Search Results !

తిరుమల ఏడుకొండల పరమార్ధం - Tirumala Seven Hills Paramartham

 తిరుమల ఏడుకొండల పరమార్ధం

1. వృషాద్రి
2. వృషభాద్రి 
3. గరుడాద్రి
4. అంజనాద్రి
5. శేషాద్రి
6. వేంకటాద్రి
7. నారాయణాద్రి.
ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది... బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడంలో కూడా ఒక రహస్యం ఉంటుంది.
ఆ 7కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు,పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీసామాన్యమైనది కాదు. 
అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః
ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ
పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు.

1. వృషభాద్రి - అంటే ఎద్దు :వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. 
ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. 
దానికి 4 కొమ్ములుంటాయి. 3 (భూత,
భవిష్యత్, వర్తమాన కాలాలు)
1 వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము
వేదమే ప్రమాణము. వేదము యొక్క
ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి
కొండ ఎక్కుతాడు.

2. వృషాద్రి - అంటే ధర్మం :
ధర్మం అంటే - నువ్వు వేదాన్ని
అనుసరించి చేయవలసిన పనులు.
నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి
వినడం, చూడడం, మంచి
వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను,
పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు.
అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.

3. గరుడాద్రి - అంటే పక్షి -
ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం.
షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క
పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది.
పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన
వాటికి 6 వికారాలు ఉంటాయి.
పుట్టినది, ఉన్నది, పెరిగినది,
మార్పు చెందినది, తరిగినది, నశించినది.
ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే
ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు.
భ == ఐశ్వర్య బలము, వీర్య
తేజస్సు మరియు అంతా తానే
బ్రహ్మాండము అయినవాడు.
అన్ == ఉన్నవాడు, కళ్యాణగుణ
సహితుడు, హేయగుణ రహితుడు.
అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత
తెలుసుకోవడమే గరుడాద్రి.

4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి
కాటుక.
ఈ కంటితో చూడవలసినవి మాత్రమే
చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో
అంతటా బ్రహ్మమే ఉందని
తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా
పరమాత్మ సృష్టియే.
అప్పుడు అంజనాద్రి దాటతాడు.


5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే
అని చూసాడనుకోండి వాడికి
రాగద్వేషాలు ఉండవు. వాడికి
క్రోధం ఉండదు. వాడికి
శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో
గీతాచార్యుడు చెప్పాడు, తుల్య నిందా
స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు)
తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి
భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి
భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా
ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే
శేషాద్రిని ఎక్కడం.


6. వేంకటాద్రి - వేం : పాపం, కట :
తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా
బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే
మనకి
బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా
కనవడుతారు. రామ కృష్ణ పరమహంస ఈ
పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో
అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని,
పిచ్చివాడు ఒకలా ఉంటారు.
ఆయనకే అర్పణం అనడం, అటువంటి
స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.


7. నారాయణాద్రి - అంటే తుల్యావస్థని
కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా
నిలబడిపోతాడు. అటువంటి స్థితిని
పొందడం నారాయణాద్రి.
వేంకటాచలంలో
ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత విశేషాలు ఉన్నాయి.


- స్వస్తి... 


Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom