భక్తి భావంలోని ఐదు సిద్ధాంతాలేంటో మీకు తెలుసా!?
భక్తిని పెంపొందించేందుకు, భక్తి మార్గాన్ని అవలంబించేందుకు ఐదు సిద్ధాంతాలు ఉన్నాయి.
1. పరమేశ్వరుడే యావత్ ప్రపంచానికి ప్రభువు, అణువణువునా వ్యాపించినా అనంతుడు ఈశ్వరుడే, మనిషి-పశువు అనే భేదం లేకుండా ఈ చరాచర ప్రపంచమంతా ఆ మహా పవిత్రుడైన ఈశ్వర అద్భుతాలతో నిండి ఉంది.
2. సంపూర్ణుడైన పరమేశ్వరుడు సృష్టించిన ఈ జగత్తులో సుఖము, సౌందర్యమే నిండి ఉంది. ఈ విశ్వాసాన్ని మనస్సు అనుసరించినప్పుడు ప్రపంచం అతి సుందరంగా కనబడుతుంది.
3. భగవంతుడు ఏది అందిస్తే దానితో తృప్తి చెంది భగవంతుడికి ఎల్లవేళలా కృతజ్ఞులుగా మెలగాలి. కష్టాలు, దుఃఖాలుగా భావించేదేది నిజమైన కష్టాలు కావు. అవన్నీ మన మనస్సుని ఉన్నత స్థాయిలో ఉంచడానికే అనే సత్యాన్ని గ్రహించాలి.
4. మనస్సును బాధపెట్టడంకంటే మించిన పాపం లేదు. ఇతరుల ప్రసన్నతను, సంతోషాన్ని సహించి పంచుకోవడమే పరమధర్మం.
5. నేను, నాది అనే అహం విడచి ఈ సమస్తం భగవంతుడిదే అనే భావాన్ని పరిపూర్ణంగా పొందేందుకు సద్గురువును ఆశ్రయించాలి. తత్ఫలితంగా భగవంతునిలో ఐక్యమయ్యే ఆదర్శ సూత్రాలు అలవడుతాయి.