Type Here to Get Search Results !

శాంతి వచనము మూడు సార్లు చెప్తాము - ఎందుకు?

 శాంతి వచనము మూడు సార్లు చెప్తాము - ఎందుకు?

    శాంతి అంటే అర్ధము ప్రశాంతత, అదే జీవి యొక్క సహజమైన స్థితి.  సహజ స్థితి ని భంగం కలిగించేవి అన్నీ అశాశ్వతాలే.  శబ్దాలు, ఆందోళనలు మరి ఏ ఇతర అడ్డంకులు మనచే గానీ ఇతరులచే గానీ కలిగిం చబడతాయి.  ఉదాహరణకి ఒక స్థలములో ఎవరైనా శబ్దము చేసే వరకు అక్కడ ఉండేది ప్రశాంతతే.   కాబట్టి మన అన్ని ఆందోళనలు అంతర్లీనంగా శాంతిని కలిగే ఉన్నాయి.  ఆందోళనలు ముగిసిన వెంటనే అప్పటికే అక్కడ ఉన్నందువల్ల శాంతి సహజంగానే అనుభవంలోనికి వస్తుంది.  ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది.  అందువలన ఏ మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరూ తన జీవితంలో శాంతిని కోరుకుంటారు.  ఐనప్పటికీ మన స్వంత ఆందోళనల చేత కప్పివేయబడినందువల్ల, అంతరంగికంగా గానీ బాహ్యంగా గానీ 'శాంతి' ని పొందడము చాల కష్టమనిపిస్తుంది.  చాల అరుదైన కొందరు మాత్రమే బాహ్యమైన ఆందోళనలు, కష్టాల మధ్య కూడా శాంతియుతంగా ఉండ గలుగుతారు.  మనము శాంతిని పొందడానికి ప్రార్ధనలు చేస్తాము.  ప్రార్ధనలు చేయడం వలన కష్టాలు ముగిసి బాహ్యఆందోళనలతో సంబంధం లేకుండా అంతరంగికంగా శాంతి అనుభవములోకి వస్తుంది.  అటువంటి ప్రార్ధనలన్నీ మూడు సార్లు శాంతి పలకడముతో ముగుస్తాయి.

మనము మూడు సార్లు శాంతి వచనము ఎందుకు చెప్తాము?

    'త్రివారం సత్యం' అనబడుతుంది.  ఏదైనా ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి మనము మూడు సార్లు అదే విషయాన్ని పునరావృతం చేస్తాము.  న్యాయ స్థానము లో కూడా, సాక్ష్యం చెప్పడానికి నిలబడినవారు "నేను నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప మరి ఇంకేమి చెప్పను" అని మూడు సార్లు చెప్తారు.  మనకు శాంతి పొందాలన్న కోరిక యొక్క తీవ్రతను నొక్కి చెప్పడానికి మనము మూడు సార్లు శాంతి వచనము వల్లిస్తాము. 

అన్ని రకాల విఘ్నాలు, సమస్యలు, మరియు దుఃఖాలు మూడు విధాలుగా ఉత్పన్నమవుతాయి. 

1. అధిదైవిక: ఏ మాత్రము మన అదుపులో లేని దైవీ శక్తుల వలన ఏర్పడే భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు మొదలగునవి.

2. అధిభూత: మనచుట్టూ ఉండి మనకు తెలిసిన ప్రమాదాలు, మానవ సంబంధాలు, కాలుష్యము నేరములు మొదలగునవి.

3. ఆధ్యాత్మిక: శారీరక వ్యాధులు, కోపము, నిరుత్సాహము వంటి మానసిక సమస్యలు.

    మనమేదైనా ప్రత్యేకమైన పని చేసేటప్పుడు మరియు నిత్య జీవితములో పైన వివరించబడిన మూడు మూలకారణాల వలన ఏ సమస్యలు లేకుండగా లేక సమస్యలను తగ్గించమని "శాంతి ఒక్కటే ఉండుగాక!" అని భగవంతుని ప్రార్థిస్థాము.  కాబట్టి మూడు సార్లు శాంతి వచనము చేయబడుతుంది.

    మొదటి సారి దూరంగా ఉన్న అవ్యక్త శక్తులను ఉద్దేశించి శాంతి వచనము చేయబడుతుంది.  మన వెనువెంట ఉన్న పరిసరాలను మరియు చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులను ఉద్దేశించి రెండవసారి కొంత మృదువు గాను; తమకు తాము ఉద్దేశించి చివరి సారి బాగా మృదువుగాను శాంతి వచనము చేయబడుతుంది.




Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom