Type Here to Get Search Results !

కేదారేశ్వర వ్రత కల్పము - Kedareswara Vrata Kalpamu

 కేదారేశ్వర వ్రత కల్పము

కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసములో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.

ఈ వ్రత మహత్యం వలననే పార్వతీదేవి శివుని అర్థశరీరాన్ని పొందినదని పురాణ ప్రతీతి.


ప్రార్థన

శ్లోకం

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయస్వాహా, ఓం మాధవాయస్వాహా

సంకల్పం

మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమే ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహా కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలశ్య ఈశాన్యప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన.....నామ సంవత్సరే... దక్షిణాయనే. శరత్ ఋతౌ, కార్తీకమాసే...పక్షే...తిథౌ... వాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్ గోత్ర... నామధేయః...మమ ధర్మపత్నీ సమేతస్య, సకుటుంబస్య, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్ధం సర్వాభీష్ట సిత్యర్థం, శ్రీ కేదారేశ్వర ప్రీత్యర్ధం, శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్చ ప్రీత్యర్ధం యావచ్ఛక్తి ధ్యానావాహ నాది పూజాం కరిష్యే.


షోడశోపచారాలు

ధ్యానం

శూలం ఢమరుకంచైవ - దదానం హస్త యుగ్మకే

కేదారదేవ మీశానం ధ్యాయేత్ త్రిపుర ఘాతినమ్,

శ్రీ కేదారేశ్వరాయ నమః ధ్యాయామి

ఆవాహనం

కైలాస శిఖరే రమ్యే పార్వత్యా స్సహితప్రభో

ఆగచ్చ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర

శ్రీ కేదారేశ్వరాయ నమః ఆవాహయామి

ఆసనం

సురాసుర శిరోరత్న - ప్రదీపిత పదాంబుజ

కేదారదేవ మద్దత్త మాసనం ప్రతిగుహ్యతామ్

శ్రీ కేదారేశ్వరాయ నమః ఆసనం సమర్పయామి

పాద్యం

గంగాధర నమస్తేస్తు - త్రిలోచన వృషభద్వజ

మౌక్తికాసన సంస్థాయ - కేదారాయ నమోనమః

శ్రీ కేదారేశ్వరాయ నమః పాద్యం సమర్పయామి

అర్ఘ్యం

అర్ఘ్యం గృహాణ భగవన్ - భక్త్యాదత్తం మహేశ్వర

ప్రయచ్ఛమే మనస్తుభ్యం - భక్తానా మిష్టదాయకం

శ్రీ కేదారేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి

ఆచమనీయం

మునిభిర్నా రథప్రఖ్యైర్నిత్య మాఖ్యాత వైభవః

కేదారదేవ భగవాన్ గృహాణా చమనం విభో

శ్రీ కేదారేశ్వరాయ నమః ఆచమనీయం సమర్పయామి

పంచామృత స్నానం

స్నానం పంచామృతైర్ధేవ శుద్ధ శుద్ధోద కైరపి

గృహాణగౌరీరమణత్వద్బక్తేన మయార్పితం

శ్రీ కేదారేశ్వరాయ నమః పంచామృతస్నానం సమర్పయామి

స్నానం

నదీజల సమాయుక్తం మయాదత్త మనుత్తమం

స్నానం స్వీకురుదేవేశ - సదాశివ నమోస్తుతే

శ్రీ కేదారేశ్వరాయ నమః స్నానం సమర్పయామి

వస్త్రం

వస్త్ర యుగ్మం సదాశుభ్రం - మనోహర మిదం శుభం

దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యాతాం

శ్రీ కేదారేశ్వరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి

యఙ్ఞోపవీతం

స్వర్ణ యాఙ్ఞోపవీతం కాంచనం చోత్తరీయకం

రుద్రాక్షమాలయా యుక్తం - దదామి స్వీకురు ప్రభో

శ్రీ కేదారేశ్వరాయ నమః యఙ్ఞోపవీతం సమర్పయామి

గంధం

సమస్త గ్రంథద్రవ్యాణాం - దేవత్వమసి జన్మభూః

భక్త్యాసమర్పితం ప్రీత్యా - మయాగంధాది గృహ్యతామ్

శ్రీ కేదారేశ్వరాయ నమః గంధాన్ ధారయామి

అక్షతలు

అక్షతో సి స్వభావేన - భక్తానామక్షయం పదం

దదాసినాథ మద్దతైరక్షతైః స్స్వీయతాం భవాన్

శ్రీ కేదారేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి

పుష్పం

కల్పవృక్ష ప్రసూవైస్వం పూర్వై రభ్యర్చిత సురైః

కుంకుమైః పార్దివై రేభిరిదానీమర్చతాం మయా

శ్రీ కేదారేశ్వరాయ నమః పుష్పాణి పూజయామి

తతః ఇంద్రాది లోకపాలక

పూజాం కుర్యాత్ శివస్య దక్షిణేభాగే {కుడివైపు} బ్రాహ్మణేనమః ఉత్తరభాగే {ఎడమవైపు} విష్ణవేనమః మధ్యే కేదారేశ్వరాయ నమః


అథాంగ పూజ

మహేశ్వరాయ నమః - పాదౌ పూజయామి,

ఈశ్వరాయ నమః - జంఘే పూజయామి,

కామరూపాయ నమః - జానునీ పూజయామి,

హరాయ నమః - ఊరూ పూజయామి,

త్రిపురాంతకాయ నమః - గూహ్యం పూజయామి,

భవాయ నమః - కటిం పూజయామి,

గంగాధరయ నమః - నాభిం పూజయామి,

మహాదేవాయ నమః - ఉదరం పూజయామి,

పశుపతయే నమః - హృదయం పూజయామి,

పినాకినే నమః - హస్తాన్ పూజయామి,

శివాయ నమః - భుజౌ పూజయమి,

శితికంఠాయ నమః - కంఠం పూజయామి,

విరూపాక్షాయ నమః - ముఖం పూజయామి,

త్రినేత్రాయ నమః - నేత్రాణి పూజయామి,

రుద్రాయ నమః - లలాటం పూజయామి,

శర్వాయ నమః - శిరః పూజయామి,

చంద్రమౌళయే నమః - మౌళిం పూజయామి,

పశుపతయే నమః - సర్వాణ్యాంగాని పూజయామి


అష్టోత్తర శతనామ పూజ

  1. ఓం శివాయ నమః

  2. ఓం మహేశ్వరాయ నమః

  3. ఓం శంభవే నమః

  4. ఓం శశిరేఖాయ నమః

  5. ఓం పినాకినే నమః

  6. ఓం వాసుదేవాయ నమః

  7. ఓం విరూపాక్షాయ నమః

  8. ఓం నీలలోహితాయ నమః

  9. ఓం శూలపాణయే నమః

  10. ఓం విష్ణువల్లభాయ నమః

  11. ఓం అంబికానధాయ నమః

  12. ఓం భక్తవత్సలాయ నమః

  13. ఓం శర్వాయ నమః

  14. ఓం శితికంఠాయ నమః

  15. ఓం ఉగ్రాయ నమః

  16. ఓం కామారయే నమః

  17. ఓం గంగాధరాయ నమః

  18. ఓం కాలకాలయ నమః

  19. ఓం భీమాయ నమః

  20. ఓం మృగపాణయే నమః

  21. ఓం కైలాసవాసినే నమః

  22. ఓం కఠోరాయ నమః

  23. ఓం వృశాంకాయ నమః

  24. ఓం భష్మోద్ధూళిత విగ్రహాయ నమః

  25. ఓం సర్వమయాయ నమః

  26. ఓం అశ్వనీరాయ నమః

  27. ఓం పరమాత్మవే నమః

  28. ఓం హవిషే నమః

  29. ఓం సోమాయ నమః

  30. ఓం సదాశివాయ నమః

  31. ఓం వీరభద్రాయ నమః

  32. ఓం కపర్థినే నమః

  33. ఓం శంకరాయ నమః

  34. ఓం ఖట్వాంగినే నమః

  35. ఓం శిపివిష్టాయ నమః

  36. ఓం శ్రీకంఠాయ నమః

  37. ఓం భవాయ నమః

  38. ఓం త్రిలోకేశాయ నమః

  39. ఓం శివాప్రియాయ నమః

  40. ఓం కపాలినే నమః

  41. ఓం అంధకాసురసూదనాయ నమః

  42. ఓం లలాటక్షాయ నమః

  43. ఓం కృపానిధయే నమః

  44. ఓం పరశుహస్తాయ నమః

  45. ఓం జటాధరాయ నమః

  46. ఓం కవచినే నమః

  47. ఓం త్రిపురాంతకాయ నమః

  48. ఓం వృషభారుఢాయ నమః

  49. ఓం సోమప్రియాయ నమః

  50. ఓం త్రయిమూర్తయే నమః

  51. ఓం సర్వఙ్ఞాయ నమః

  52. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః

  53. ఓం యజ్జమయాయ నమః

  54. ఓం పంచ్వక్త్రాయ నమః

  55. ఓం విశ్వేశ్వరాయ నమః

  56. ఓం గణనాధయ నమః

  57. ఓం పజాపతయే నమః

  58. ఓం దుర్ధర్షాయ నమః

  59. ఓం గిరీశాయ నమః

  60. ఓం భుజంగభూషణాయ నమః

  61. ఓం గిరిధన్వినే నమః

  62. ఓం కృత్తివాసనే నమః

  63. ఓం భగవతే నమః

  64. ఓం మృత్యుంజయాయ నమః

  65. ఓం జగద్వాయ్యపినే నమః

  66. ఓం వ్యోమకేశాయ నమః

  67. ఓం చారువిక్రమాయ నమః

  68. ఓం భూతపతయే నమః

  69. ఓం అహిర్భుద్న్యాయ నమః

  70. ఓం అష్టమూర్తయే నమః

  71. ఓం సాత్వికాయ నమః

  72. ఓం శాశ్వతాయ నమః

  73. ఓం అజాయ నమః

  74. ఓం మృణాయ నమః

  75. ఓం దేవాయ నమః

  76. ఓం అవ్యయాయ నమః

  77. ఓం పూషదంతభిదే నమః

  78. ఓం దక్షాధ్వరహరాయ నమః

  79. ఓం భగనేత్రవిదే నమః

  80. ఓం సహస్రాక్షాయ నమః

  81. ఓం అపవర్గప్రదాయ నమః

  82. ఓం తారకాయ నమః

  83. ఓం హిరణ్యరేతసే నమః

  84. ఓం ఆనఘాయ నమః

  85. ఓం భర్గాయ నమః

  86. ఓం గిరిప్రియాయ నమః

  87. ఓం పురారాతయే నమః

  88. ఓం ప్రమధధిపాయ నమః

  89. ఓం సూక్ష్మతనవే నమః

  90. ఓం జగద్గురువే నమః

  91. ఓం మహాసేన జనకాయ నమః

  92. ఓం రుద్రాయ నమః

  93. ఓం స్థాణవే నమః

  94. ఓం దిగంబరాయ నమః

  95. ఓం అనేకాత్మనే నమః

  96. ఓం శుద్ధవిగ్రహాయ నమః

  97. ఓం ఖండపరశువే నమః

  98. ఓం పాశవిమోచకాయ నమః

  99. ఓం పశుపతయే నమః

  100. ఓం మహాదేవాయ నమః

  101. ఓం అవ్యగ్రాయ నమః

  102. ఓం హరాయ నమః

  103. ఓం సహస్రపాదే నమః

  104. ఓం అనంతాయ నమః

  105. ఓం పరమేశ్వరాయ నమః

  106. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః


అధసూత్ర గ్రంధిపూజ

  1. ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి

  2. ఓం శాంతాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి

  3. ఓం మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి

  4. ఓం వృషభద్వజాయ నమః చతుర్ధ గ్రంథిం పూజయామి

  5. ఓం గౌరీశాయ నమః పంచమ గ్రంథిం పూజయామి

  6. ఓం రుద్రాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి

  7. ఓం పశుపతయే నమః సప్తమ గ్రంథిం పూజయామి

  8. ఓం భీమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి

  9. ఓం త్రయంబకాయ నమః నవమ గ్రంథిం పూజయామి

  10. ఓం నీలలోహితాయ నమః దశమ గ్రంథిం పూజయామి

  11. ఓం హరాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి

  12. ఓం స్మరహరాయ నమః ద్వాదశ గ్రంథిం పూజయామి

  13. ఓం భర్గాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి

  14. ఓం శంభవే నమః చతుర్ధశ గ్రంథిం పూజయామి

  15. ఓం శర్వాయ నమః పంచదశ గ్రంథిం పూజయామి

  16. ఓం సదాశివాయ నమః షోఢశ గ్రంథిం పూజయామి

  17. ఓం ఈశ్వరాయ నమః సప్తదశ గ్రంథిం పూజయామి

  18. ఓం ఉగ్రాయ నమః అష్టాదశ గ్రంథిం పూజయామి

  19. ఓం శ్రీకంఠాయ నమః ఏకోన వింశతి గ్రంథిం పూజయామి

  20. ఓం నీలకంఠాయ నమః వింశతి గ్రంథిం పూజయామి

  21. ఓం మృత్యుంజయాయ నమః ఏకవింశతి గ్రంథిం పూజయామి


శ్రీ కేదారేశ్వర వ్రత కథ

పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతమును గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాది మునులకు చెప్పెను.

శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని యుండెను. సిద్ధ - సాధ్య - కింపురుష - యక్ష - గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించు చుండిరి. ఋషులు - మునులు - అగ్ని - వాయువు - వరుణుడు - సూర్యచంద్రులు - తారలు - గ్రహాలు - ప్రమదగణాలు - కుమారస్వామి - వినాయకుడు - వీరభద్రుడు - నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల - సాల - తమలా - వకుళ - నరికేళ - చందన - పనస - జంభూ వృక్షములతోను చంపక - పున్నాగ - పారిజాతాది పుష్పాదులతోను మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నదపరతములతోను చతుర్ధశ భువనాలు పులకిస్తున్నాయి.

అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించుచుండెను. శివుడాతనిని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలుగాగల వందిమాగాదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీ భర్తను చేరి నాథా ! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని దేవీ ! పరమార్ధ విదులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై యుండి యాదండ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునొనర్చుటకై నిశ్చయించుకొన్నది. కైలాసమును వదలి శరభ శార్దూల గజములు గల నాగ గరుడ చక్ర

వాక పక్షసముదాయంతో నానావిధ ఫలపుష్ప తరు లతాదులతో కూడుకొనిన్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది.

ఆశ్రమవాసులామెను చూచి అతిథి మర్యాదలోనర్చి తల్లీ నీవెవ్వరవు ఎవరిదానవు ఎచటనుండి వచ్చితివి నీరాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వాతి మిక్కిలి ఆనందించినదై యఙ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమ నిష్టాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివుని సతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి. మహర్షులారా ! జగత్కళ్యాణాభిలాషులారా! నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది.

అందుకు గౌతముడు పార్వతీ ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడ్ని కోరింది. జగజ్జననీ ఈ వ్రతాన్ని ఆసీవీజ మాసంలో శుక్ల పక్షంలో అష్టమియందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను., ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభము నుంచి ఇరువది యొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య - భోజ్య, నైవేద్యాదులు కదళీఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలిచ్చి వారలను తృప్తి పరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు.

గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంగ తరంగయై భర్తతో నిజనివాసము కైలాసమున కోరెను.

కొంతకాలమునకు శివభక్త పరాయుణడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడిచేయగోరి దివినుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు.

ఆతదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి యను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనకా మాకు కేదార వ్రతము చేయుటకు అనుఙ్ఞనిమ్మని అడిగారు. అందుకాతడు బిడ్డలారా ! నేను దరిద్రుడను. సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరా ఆలోచనను మానుకోండని పలికెను. అందుకా వైశ్యపుత్రికలు నీ ఆఙ్ఞయే మాకు ధనము అనుఙ్ఞ నియ్యవలసినదని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం క్రింద కూర్చుని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు.

ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంత కాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదార వ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త ఆమెను, కుమారుడ్ని రాజ్యము నుండి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబలిచి నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్ధించి తీసుకొని రావలసిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది. అతడు తిరిగివస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత దనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరురూపుడైన శివుడా సొమ్మును తీసుకొనిపోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి ! నీవు ఎన్నిసార్లు నీ పెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు.

అప్పుడామే బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడా ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీ మార్భలముతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది.

ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివిన, విన్న అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుదురు.


శ్రీ కేదారేశ్వర వ్రతం సమాప్తం.



Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom