రామాయణమునకు సంబంధించిన స్థలాలు, గుడులూ
అయోధ్య
భద్రాచలము
రామేశ్వరము
చిత్రకూటము
లంక
రామసేతు
లంక: నేటి శ్రీలంక యే రామాయణములో చెప్పిన లంక అని హిందువులు భావిస్తారు. శ్రీలంకలో రామాయణానికి సంబంధించిన చారిత్రిక కథలు స్థలాలు కనిపిస్తాయి. 1. ఋషి పులస్తి (రావణుని తాత) విగ్రహము 2. విస్రవాసముని (రావణుని తండ్రి) విగ్రహము 3. అశోకారణ్యము 4. రావణ జల పాతాలు - రావణ గుహలు 5.చారియత్ పాత్ (సీతాదేవిని మండోదరి కోట నుండి అశోకవనానికి తీసికెళ్లిన దారి)
చిత్ర కూటము: శ్రీరాముడు అరణ్యవాసములో మొదటి 12 సంవత్సరములు ఈ ప్రాంతము లోనే ఉన్నాడని హిందువుల నమ్మకం. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రములో చిత్రకూతట్ జిల్లాలో కాశికి దగ్గరలో ఈ అటవీ ప్రాంతము ఉంది. ఇప్పటికీ ఇది దట్టమయిన ఆటవీ ప్రాంతము. ఇక్కదడ భరత్ కుండ్, సీతాకుండ్, హనుమాంధార ఇంకా అనేక ప్రాంతాలు సీతారాములు తిరిగిన ప్రదేశాలుగా గుర్తింపబడినవి.