లౌకికవాదం
ఇటీవల ఐ-సర్వ్ అనే ఆధ్యాత్మిక సంస్థ ఒక అమెరికన్ సాఫ్టువేర్ లో పంచాగాన్ని ఉపయోగించి శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5114 లో జనవరి 10 న జన్మించాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిని పలువురు విభేదించారు. రాముడి ఉనికి అవాస్తవమని, భారతీయ సంస్కృతి - మనిషి సత్ప్రవర్తన - కుటుంబవ్యవస్థ పటిష్ఠత కోసం వ్రాయబడిన రామాయణం కేవలం కల్పిత కథ అని, వాల్మీకి రాముడి సమకాలీకుడు కాదని, క్రీస్తు పూర్వం 5114 నాటికి ఎటువంటి లిపి అభివృద్ధి కాలేదని, ఆప్పటికి ఆర్యులు భారతదేశంలోకి అడుగుపెట్టలేదని, వారి అధికార భాష అయిన సంస్కృత భాష భారతదేశంలో లేదని, రామసేతు ప్రకృతిసిద్ధంగా ఓషన్ కరెంట్స్ వల్ల ఏర్పడిన షోల్ అని, రామసేతు వంటి షోల్స్ ప్రపంచంలో చాలా ఉన్నాయని, రామాయణ కథ జరిగినట్లు కచ్చితమైన ఆధారాలు లేవని కొంతమంది తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతున్నారు. ఏ కవి అయినా తన కావ్యంలో సహజమైన ప్రదేశాలను లిఖిస్తాడని, తాను మరణించిన తర్వాత అవి కాలగర్భంలో కలిసిపోయి వేల సంవత్సరాల తర్వాత త్రవ్వకాల్లో బయటపడినప్పుడు ఆ కావ్యం చరిత్రలా అగుపిస్తుందని, మునుషులు మరణించినా ప్రదేశాలు అలాగే ఉంటాయని, అసలు లంక అనగా సముద్రతీర ప్రాంతమని, రామాయణంలో లంక అని వ్రాసియుంది కాని శ్రీలంక అని లేదని మరికొందరి అభిప్రాయం.