హాయిగా.. ఆనందంగా గడిపేందుకు మార్గమేంటి?
ఈ లోకంలో చాలా మంది చాలా రకాలైన సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటి వారు తమ జీవితాన్ని హాయిగా, ఆనందమయంగా గడిపే మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. ఇలాంటి వారు విధిగా కొన్ని ప్రమాణాలను పాటించినట్టయితే ఖచ్చితంగా వారి జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని పలువురు ఆధ్యాత్మిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం వారు చేయాల్సిందల్లా తాము ఎంచుకున్న ప్రమాణాలను క్రమం తప్పకుండా అనుసరించడమే.
ఇందుకోసం ఈ రోజు కోపం తెచ్చుకోను. ఆందోళన చెందను. కృతజ్ఞతాభావంతో మెలుగుతాను. అందరిపట్ల సానుభూతితో వ్యవహరిస్తాను. పనిని మనస్ఫూర్తిగా.. ఉల్లాసంగా పూర్తి చేస్తాను. పూర్తిగా సంతోషంతో, ప్రశాంతతో ఉంటాను అని తమకు తామే చెప్పుకోవాలి.
అయితే, ప్రతి రోజూ ఉదయం లేవగానే ఊరికే అనుకుని వదిలి వేయకూడదు. మనఃపూర్వకంగా అచరించే ప్రయత్నాలు సాగించాలి. దైనందిన కార్యకలాపాల్లో ఒత్తిళ్లు, ఆనందోళనలు ఉండటమన్నది సహజం. వాటిని అంతటితో వదిలేయాలని సలహా ఇస్తున్నారు. తమకు ఎదురయ్యే కష్టనష్టాలను తలచుకుంటూ కుంగిపోవడం కంటే.. వాటిని వదిలి వేసి ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు.