వివాహంలో దంపతుల చేత ఏడు అడుగులు ఎందుకు వేయిస్తారు...?
వివాహ సమయంలో దంపతుల చేత ఏడు అడుగులు వేయిస్తారు. హోమం చుట్టూ వేసే ఆ ఏడు అడుగులనే సప్తపది అంటారు. సప్తపదిలో వేసే ప్రతి అడుగుకు ఒక అర్థముంది.
తొలి అడుగు తమ జీవితాలకు అవసరమైన ఆర్థిక శక్తి సాధనకు, రెండవ అడుగు ఆరోగ్యకర ఆధ్యాత్మిక చింతనకు, మూడవ అడుగు ధర్మబద్ధ ఆర్థిక సంపాదన కొరకు, నాల్గవ అడుగు విజ్ఞాన సముపార్జనకు, ఆనంద, ప్రేమ, గౌరవాలకు, ఐదవ అడుగు సంతానం పొంది వారి బాధ్యత తీసుకుంటామని, ఆరవ అడుగు తమ చర్యలపై నియంత్రణ సాధనకు, ఏడవ అడుగు ఒకరికోసం మరొకరిగా కలకాలం బతుకుతామనే వేయిస్తారు.
మొత్తం జీవితానికి అవసరమయిన అంశాలన్నింటిని ఈ ఏడు అడుగుల్లోకి ఇమిడ్చి ప్రామాణికంగా రూపొందించడాన్నే సప్తపది అని అంటారు.