అర్జునుడు అఖండమైన సవ్యసాచి ఎలా పేరుగాంచాడు?
మహాభారతంలోని పంచపాండవుల్లో అర్జునుడు ఒకరు. ఈయన ఘనమైన విలుకాడుగా ఎలా రూపొందడానికి ప్రధాన కారణంగా ఆయనలో ద్విగుణీకృతమైన పట్టుదల. మొక్కవోని దీక్షలే. తనకు కాంతి తక్కువ ఉన్నప్పుడు విలువిద్య కష్టంగా ఉందని పలికిన అర్జునుడితో ద్రోణుడు "అర్జునా.. నీవు ఈ జగతిలో స్థిరంగా నిలిచిపోయే విలుకాడు కావాలని ఆకాంక్షిస్తున్నావు.
దీనికి కావలసింది పట్టుదల నిండిన హృదయం, అంకితభావం. కఠోరంగా పరిశ్రమిస్తే శబ్దాన్ని బట్టి ఆ వస్తువును ఛేదించే శబ్దవేది విద్యలోనూ నీవు గొప్ప విలుకాడు కాగలవు. అతి సున్నితమైన వస్తువులను సైతం ఛేదించాలంటే నీవు అతి తక్కువ కాంతితో సాధన చేస్తేనే పరిపూర్ణుడివి అవుతావు అని అనగానే అర్జునునికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. అప్పటి నుంచి నిరంతరం పరిశ్రమించి తన విద్యలో అఖండమైన ప్రజ్ఞను సాధించి జగతిలోనే 'సవ్యసాచి'గా పేరుగాంచాడు.